Sunday, December 11, 2011

ఆత్మనేపదము

ఆత్మవిమర్శ, అత్మన్యునత, ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం, ఆత్మార్థం...

ప్రతి ఓటమిలోని తప్పులని ఆత్మవిమర్శ చేసుకుంటూ
ఓడిదిడుకుల మద్య అత్మన్యునతను ఎదుర్కొంటూ
ఎత్తి పోడుపులనుండి అత్మభిమానాన్ని కాపాడుకొంటూ
ప్రతి గెలుపుతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ
ఆత్మార్థం కోసం జీవించు

Monday, December 5, 2011

ఆత్మీయత

తన పేరు తెలిదు తను ఎక్కడ ఉంటారో తెలిదు. కాని ప్రతి ఉదయం సూర్యకిరణాల వెలుగులు పూర్తిగా విరజిమ్మక ముందే మా ఎడుర్కొల్పులు మేము కలుసుకునేది కొన్ని క్షణాలు మాత్రమే మాట్లాడుకునేది కొన్ని మాటలే.. !! శుబోధయం, ఎలా ఉన్నారు, ఆ రోజు వాతావరణం ఎలా ఉంటుందో అని ...చివరగా వీడుకోలు, ఇదే ప్రతి ఉదయం ఉద్యగానికి వెళ్ళే ముందు దినచర్య .

కొన్ని రోజుల తరువాత ఉద్యోగరిత్యా నేను కొన్ని రోజులు ప్రయాణం చేయవలసి వచ్చింది, సముద్రపు ప్రయాణం తరువాత వచ్చిన మరుసటి రోజు ప్రొద్దున తిరిగి మా కలయిక... ఈ సారి మా మాటల ప్రవాహం ఆగలేదు నా ప్రయాణపు అనుభవలా దగ్గరనుంచి రాజకియాలవరకు వెళ్ళింది అలా మాట్లాడుకుని ఆ రోజుకి వీడుకోలు చెప్పుకున్నాం.

అక్కడనుంచి నా ప్రయాణం నా ఉద్యోగస్తలం ఆ కొద్ది నిమిషాల ప్రయాణంలో కుటుంబ సభ్యులు, బందువులు మరియు స్నేహితులు ఇలా ఎంతో మంది ఆత్మీయులను వదిలి ఉంటున్నానన్న వెలితికి ఒక తాత్కాలిక వెసులుబాటు కలిగింది !! తాత వయస్సులో ఉన్న తనని కలిసినప్పుడు కలిగే ఆత్మీయతా భావం గుర్తు తెచ్చుకుంటే నాలోని ఏదో ఆనందం... ప్రతి రోజు ఇలాంటి ఎన్నో అనుభవాలు.. మనసులోని ఎన్నో సంఘర్షణలకు జవాబులను ఇస్తూనే ఉంటాయి. జీవితానికి ఒక ప్రశాంతమైన దృక్పథం అలవడుతుంది.

-
తల్లోదండ్రులకు దూరంగా ఉండి చదువుకునే లేదా ఉద్యోగం చేసే వాళ్ళ తరుపునుంచి నేను చెప్పే కొన్ని భావనలు.. మేము మీకు దూరంగా ఉన్నా మా పరిసరాలలో మిమ్మల్ని ఎప్పుడు వెదుకుతూనే ఉంటాం, చుట్టూ ఉన్నవాళ్ళలో మిమ్మల్ని చూసుకుంటాం.  

Sunday, November 20, 2011

నా ఉద్యోగం

నా ప్రస్తుత ఉద్యోగం  "Mooring Engineer"..

ఇదే విషయం మా అమ్మమ్మకి చెపితే మోరి ఇంజనీరు ఏందిరా అనింది? "మోరి ఇంజనీరు" కాదు "మూరింగ్ ఇంజనీరు" అని చెప్పడానికి ప్రయత్నించా కానీ విషయం మొదటికి వచ్చింది..మోరిలు తవ్వుతవ ఏంది అనింది?

అయ్యో  నేను నీటిలో తేలుతూ ఉండే పడవలకి లంగరు వేస్తూ ఉంటా అని చెప్తే .. ఆ పని చేయడానికి అంత పెద్ద చదువులు చదివి అంత దూరం పోవడం అవసరమా అనింది?

అలా కాదు సముద్రంలో తేలుతూ ఉండే పెద్ద బోరు బావులు తవ్వే పడవకి లంగరు వేస్తుంట అంటే, నీళ్ళలో ఉంటూ బోరు బావులు తవ్వడం ఏందిరా అనింది!!

ఈ పడవలు తవ్వే బావులు నీళ్ళకోసం కాదు చమురు కోసం అని, ఈ పడవలు అలల తాటికి, గాలి తాటికి కొట్టుకొని పోకుండా సంరక్షించేందుకు లంగరు వేసి ఉంచుతాము అని చెప్పా, చమురు తవ్వుకుంటారు సరే అది భూమి మీదకి ఎలా తెస్తారు అనింది!!

క్షీర సాగర మధనం తరువాత గరుత్మంతుడు అమృతభాండాన్ని ఎలా తీసుకోని వచ్చాడో నాకు తెలిదు కానీ, ఈ చమురుని పైపులు లేదా పడవల ద్వారం నేల మీదకి తీసుకోని వస్తారని చెప్పే పాటికి మా అమ్మమ్మకు నా ఉద్యోగం గురుంచి పూర్తిగా అర్థం అయ్యిందో లేదో కానీ తన కళ్ళల్లో ఏదో ఆనందం!!! అదేదో నేనే చమురు బావులు తవ్వేస్తున్నానట్టుగా!!!  నేను చేసే పని చమురు పరిశ్రమలో ఇసుమంత అని మరొక సారి చెప్పా !! మొత్తానికి ఒక ఆసక్తికరమైన సంభాషణ జరిగింది మా మద్య :)

కొన్ని సార్లు మనం చేసే పని చిన్నదే అయిన దానికి గల ప్రాముఖ్యత చాల ఉంటుంది.. ఏ పని చేస్తున్నామని కాదు చేసే పని ఇష్టమేనా అన్నది ముఖ్యం. 

Monday, August 29, 2011

భగ్న ప్రేమ


మదిలో నాకోసం గుడి కట్టావన్నావు
జీవితాంతం నాతోనే పయనమన్నావు 
అల్లంత దురాన ఉన్నావన్నావు
ఎడబాటులోని ఎదురుచూపులు  భారమన్నావు 
దరి చేరుకునే సరికి నన్ను కాదన్నావు
వీడలేని వేడుకోలు వద్దన్నావు
కళ్ళ ముందు ఆశల సౌధం కరిగిపోతుంటే
కాళ్ళ కింది అడుగునేల సుడిగుండెంలా మారుతుంటే 
బూతకాలం లోని భగ్నాలను మరిచిపోతూ, 
వర్తమానంలోని వెలుగుని చూస్తూ, 
భవిష్యత్తుకు భరోసానిస్తూ మరో అడుగు


Friday, July 22, 2011

జన్మదిన శుభాకాంక్షలు

చిన్నారి పాపాల చిరునవ్వులు చిందిస్తూ,
చిరు దివ్వెల వెలుగునిస్తు చిరకాలం చిరంజీవిల బ్రతకాలని ఆశిస్తూ.. 

Monday, April 25, 2011

అలజడి


కాలంతో పరిగెడుతు, గమ్యమేటో తెలియని సమయాన 
ఒక్క సరిగా నాలో అలజడి 
సముద్రాలూ దాటి దేని కోసం ఈ వేట అంటు
జ్ఞాన శోదన కోసమా, కాసుల వేట కోసమా అంటు 
ఆత్మీయులకు దూరంగా ఉంటు
సుఖ దుఖాలను, గెలుపు ఓటములను పంచుకోలేని సమయాన 
దూరాన్నిదగ్గర చేసే ప్రతీ ప్రయత్నం
మాతృ ప్రేమకై, మాతృదేశానికి పయనం ఎప్పుడుదేప్పుడా అని మది నిండా ఆలోచనలు 

Thursday, March 24, 2011

చిరు కావ్యం


సూర్యోదయంలోని ఉషాకిరణాలు
నీలాకాశంలో తెల్లని మబ్బులు
అద్దంలా మెరిసే సముద్రంలోని అలలు
సూర్యాస్తమయంలోని సముద్రపు ప్రతిబింబాలు
ఇవన్నికన్నులకు మధురమైన దృశ్యాలు

ఏకాంతపువేల సముద్రపు ఒడిలోన  నా కలంనుంచి జాలువారిన చిరు కావ్యం

Thursday, March 17, 2011

అందం, ఆకర్షణ, అవగాహన, అణకువ, అనుబంధం...

త్వరలో ....


ప్రేమికుల మద్య విడదీయరాని అనుబంధం ఎలా ...

Wednesday, January 12, 2011

స్నేహం & జీవితభాగస్వామి

ఈ ప్రపంచంలో రక్త సంబంధం అనేది లేకుండా ఒక మనిషికి ఎల్లకాలం తోడు నీడగా ఉండేది ఇద్దరే ఒకరు స్నేహితుడు, ఇంకొకరు జీవిత భాగస్వామి