Monday, December 14, 2009

ఆశ, అవసరం, ఆశయం....

ప్రతి మనిషికి ఎన్నో ఆశలు ఉంటాయి కానీ ప్రతి ఆశ అవసరం అవ్వకపోవచ్చు, అవసరమైన ఆశలను ఆశయలుగా మార్చుకుంటే ప్రతి మనిషి జీవితం లో ఏంటో ఎత్తుకు ఎదగడానికి అవకాశం ఉంటుంది.
ఇది చదువుతున్నప్పుడు మనసులో మెదిలే ఎన్నో ప్రశ్నల్లో ఒకటి ఏంటో తెలుసా , ఆశ మరియు కోరిక రెండు ఒకటేనా కాదా అని? నాకు తెలిసినంతవరకూ రెండు ఒక్కటే.. ప్రతి మనషికి ఎన్నో ఆశలు ఉంటాయి ఒక పెద్ద ఇల్లు కావాలని, ఒక పెద్ద కారు కావాలని,కారు, నగలు, బ్యాంకు ఖాతాల్లో పెద్ద మొత్తాల్లో డబ్బులు ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో ఎన్నో ఆశలు ఉంటాయి..ఇప్పుడే రెక్కలు వచ్చిన పక్షి ఎలా ఒక్క చెట్టు మీద నిలకడగా ఉండలేదో అలాగే మన ఆశలు కూడా అంతే ఏవి నిలకడగా ఉండవు.. మనకు ఉండే ఆశలను అదుపులో పెట్టుకుంటూ వాటిలో మనకు ఏది అవసరమో అనేది తెలుసుకోవాలి..ఆ అవసరాన్ని ఆశయంగా మార్చుకుని దాన్ని నెరవేర్చుకోవడానికి కృషి చేయాలి.