Sunday, December 11, 2011

ఆత్మనేపదము

ఆత్మవిమర్శ, అత్మన్యునత, ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం, ఆత్మార్థం...

ప్రతి ఓటమిలోని తప్పులని ఆత్మవిమర్శ చేసుకుంటూ
ఓడిదిడుకుల మద్య అత్మన్యునతను ఎదుర్కొంటూ
ఎత్తి పోడుపులనుండి అత్మభిమానాన్ని కాపాడుకొంటూ
ప్రతి గెలుపుతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ
ఆత్మార్థం కోసం జీవించు

Monday, December 5, 2011

ఆత్మీయత

తన పేరు తెలిదు తను ఎక్కడ ఉంటారో తెలిదు. కాని ప్రతి ఉదయం సూర్యకిరణాల వెలుగులు పూర్తిగా విరజిమ్మక ముందే మా ఎడుర్కొల్పులు మేము కలుసుకునేది కొన్ని క్షణాలు మాత్రమే మాట్లాడుకునేది కొన్ని మాటలే.. !! శుబోధయం, ఎలా ఉన్నారు, ఆ రోజు వాతావరణం ఎలా ఉంటుందో అని ...చివరగా వీడుకోలు, ఇదే ప్రతి ఉదయం ఉద్యగానికి వెళ్ళే ముందు దినచర్య .

కొన్ని రోజుల తరువాత ఉద్యోగరిత్యా నేను కొన్ని రోజులు ప్రయాణం చేయవలసి వచ్చింది, సముద్రపు ప్రయాణం తరువాత వచ్చిన మరుసటి రోజు ప్రొద్దున తిరిగి మా కలయిక... ఈ సారి మా మాటల ప్రవాహం ఆగలేదు నా ప్రయాణపు అనుభవలా దగ్గరనుంచి రాజకియాలవరకు వెళ్ళింది అలా మాట్లాడుకుని ఆ రోజుకి వీడుకోలు చెప్పుకున్నాం.

అక్కడనుంచి నా ప్రయాణం నా ఉద్యోగస్తలం ఆ కొద్ది నిమిషాల ప్రయాణంలో కుటుంబ సభ్యులు, బందువులు మరియు స్నేహితులు ఇలా ఎంతో మంది ఆత్మీయులను వదిలి ఉంటున్నానన్న వెలితికి ఒక తాత్కాలిక వెసులుబాటు కలిగింది !! తాత వయస్సులో ఉన్న తనని కలిసినప్పుడు కలిగే ఆత్మీయతా భావం గుర్తు తెచ్చుకుంటే నాలోని ఏదో ఆనందం... ప్రతి రోజు ఇలాంటి ఎన్నో అనుభవాలు.. మనసులోని ఎన్నో సంఘర్షణలకు జవాబులను ఇస్తూనే ఉంటాయి. జీవితానికి ఒక ప్రశాంతమైన దృక్పథం అలవడుతుంది.

-
తల్లోదండ్రులకు దూరంగా ఉండి చదువుకునే లేదా ఉద్యోగం చేసే వాళ్ళ తరుపునుంచి నేను చెప్పే కొన్ని భావనలు.. మేము మీకు దూరంగా ఉన్నా మా పరిసరాలలో మిమ్మల్ని ఎప్పుడు వెదుకుతూనే ఉంటాం, చుట్టూ ఉన్నవాళ్ళలో మిమ్మల్ని చూసుకుంటాం.