మదిలో నాకోసం గుడి కట్టావన్నావు
జీవితాంతం నాతోనే పయనమన్నావు
అల్లంత దురాన ఉన్నావన్నావు
ఎడబాటులోని ఎదురుచూపులు భారమన్నావు
దరి చేరుకునే సరికి నన్ను కాదన్నావువీడలేని వేడుకోలు వద్దన్నావు
కళ్ళ ముందు ఆశల సౌధం కరిగిపోతుంటే
కాళ్ళ కింది అడుగునేల సుడిగుండెంలా మారుతుంటే
బూతకాలం లోని భగ్నాలను మరిచిపోతూ,
వర్తమానంలోని వెలుగుని చూస్తూ,
భవిష్యత్తుకు భరోసానిస్తూ మరో అడుగు