ప్రశాంతమైన, ప్రళయాంతకమైన వాతావరణాన్ని చూపెట్టావు
మండే సూర్యుడు, వెన్నెల చంద్రుడు దగ్గరవుతున్నట్టుగా;
నీలాకాశం నీరు కలిసి పోతున్నట్టుగా నేత్రానందాన్నిచ్చావు
నీలాకాశం నీరు కలిసి పోతున్నట్టుగా నేత్రానందాన్నిచ్చావు
అలల ఆటు పోట్లని ఎదిరిడడం, జీవితపు ఓడిదిడుకుల ఎదుర్కొనడం నేర్పావు
ఏకాంత వేళ మదిలోని భావాలను నా కలం నుండి జారువాడే కవితలకు ప్రేరణ అయ్యావు
నీ చెంత చేరేందుకు నింగి, నేల, నీటిపైన నే చేసిన ప్రయాణాలు ఆసక్తికరంగా మిగిల్చావు
నీ ఆతిద్యంలో జీవితకాలపు మధురానుభూతులను మిగిల్చావు
నీ ఒడిలో సేద తీరడానికి తిరిగి తప్పక వస్తానని వీడుకోలు...