Sunday, November 20, 2011

నా ఉద్యోగం

నా ప్రస్తుత ఉద్యోగం  "Mooring Engineer"..

ఇదే విషయం మా అమ్మమ్మకి చెపితే మోరి ఇంజనీరు ఏందిరా అనింది? "మోరి ఇంజనీరు" కాదు "మూరింగ్ ఇంజనీరు" అని చెప్పడానికి ప్రయత్నించా కానీ విషయం మొదటికి వచ్చింది..మోరిలు తవ్వుతవ ఏంది అనింది?

అయ్యో  నేను నీటిలో తేలుతూ ఉండే పడవలకి లంగరు వేస్తూ ఉంటా అని చెప్తే .. ఆ పని చేయడానికి అంత పెద్ద చదువులు చదివి అంత దూరం పోవడం అవసరమా అనింది?

అలా కాదు సముద్రంలో తేలుతూ ఉండే పెద్ద బోరు బావులు తవ్వే పడవకి లంగరు వేస్తుంట అంటే, నీళ్ళలో ఉంటూ బోరు బావులు తవ్వడం ఏందిరా అనింది!!

ఈ పడవలు తవ్వే బావులు నీళ్ళకోసం కాదు చమురు కోసం అని, ఈ పడవలు అలల తాటికి, గాలి తాటికి కొట్టుకొని పోకుండా సంరక్షించేందుకు లంగరు వేసి ఉంచుతాము అని చెప్పా, చమురు తవ్వుకుంటారు సరే అది భూమి మీదకి ఎలా తెస్తారు అనింది!!

క్షీర సాగర మధనం తరువాత గరుత్మంతుడు అమృతభాండాన్ని ఎలా తీసుకోని వచ్చాడో నాకు తెలిదు కానీ, ఈ చమురుని పైపులు లేదా పడవల ద్వారం నేల మీదకి తీసుకోని వస్తారని చెప్పే పాటికి మా అమ్మమ్మకు నా ఉద్యోగం గురుంచి పూర్తిగా అర్థం అయ్యిందో లేదో కానీ తన కళ్ళల్లో ఏదో ఆనందం!!! అదేదో నేనే చమురు బావులు తవ్వేస్తున్నానట్టుగా!!!  నేను చేసే పని చమురు పరిశ్రమలో ఇసుమంత అని మరొక సారి చెప్పా !! మొత్తానికి ఒక ఆసక్తికరమైన సంభాషణ జరిగింది మా మద్య :)

కొన్ని సార్లు మనం చేసే పని చిన్నదే అయిన దానికి గల ప్రాముఖ్యత చాల ఉంటుంది.. ఏ పని చేస్తున్నామని కాదు చేసే పని ఇష్టమేనా అన్నది ముఖ్యం. 

1 comment: